Wednesday, November 17, 2010

జాబిల్లి కోసం ఆకాశమల్లె వేచాను నీ రాకకై

జాబిల్లి కోసం ఆకాశమల్లె వేచాను నీ రాకకై
నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై
జాబిల్లి కోసం ఆకాశమల్లె వేచాను నీ రాకకై
నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై

నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ
మనసొక్కటి కలిసున్నది  ఏనాడైనా

నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ
మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా 
ఈ పువ్వులనే నీ నవ్వులుగా 
ఈ చుక్కలనే నీ కన్నులుగా 
నును నిగ్గుల ఈ మొగ్గలు నీ బుగ్గలుగా 
ఊహల్లో తేలి వుయ్యూతలూగి 
మేఘాలతోటి రాగల లేఖ 
నీకంపినాను రావా దేవి 

జాబిల్లి కోసం ఆకాశమల్లె వేచాను నీ రాకకై
నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై

జాబిల్లి కోసం ఆకాశమల్లె వేచాను నీ రాకకై........

నీ పేరొక జపమైనది నీ ప్రేమొక తపమైనది 
నీ ధ్యానమే వరమైనది ఎన్నాళ్ళైన 
నీ పేరొక జపమైనది నీ ప్రేమొక తపమైనది 
నీ ధ్యానమే వరమైనది ఎన్నాళ్ళైన 
ఉండి లేక ఉన్నది నీవే 
ఉన్న కూడా లేనిది నేనే 
నా రేపటి అడియాశల రూపం నీవే 
దూరాన ఉన్నా నా తోడు నీవే 
నీ దగ్గరున్న నీ నీడ నాదే
నాదన్నదంతా నీవే నీవే

జాబిల్లి కోసం ఆకాశమల్లె వేచాను నీ రాకకై
నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై

జాబిల్లి కోసం ఆకాశమల్లె వేచాను నీ రాకకై
వేచాను నీ రాకకై......

1 comment:

  1. Intamanchi patanu andinchinanduku danyavadalu shashidhar garu. Na blog lo mee ee page ki link chesanu. Anyatha bavincharani aashishtu.. - Praveen

    http://mytelugulyrics.wordpress.com/2012/06/16/%e0%b0%9c%e0%b0%be%e0%b0%ac%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%bf-%e0%b0%95%e0%b1%8b%e0%b0%b8%e0%b0%82-%e0%b0%86%e0%b0%95%e0%b0%be%e0%b0%b6%e0%b0%ae%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b1%86/

    ReplyDelete