మనసున ఉన్నది, చెప్పాలనున్నది, మాటలు రావే ఎలా
మాటున ఉన్నది, ఓ మంచి సంగతి, బయటకు రాదే ఎలా
అతడిని చూస్తే రెప్పలు వాలిపోయే, బిడియం ఆపేదెలా
ఎదురుగ వస్తే చెప్పక ఆగిపోయే, తలపులు చూపెదెలా
ఒకసారి, దరి చేరి, యద గొడవేమిటో తెలపకపోతే ఎలా
మనసున ఉన్నది, చెప్పాలనున్నది, మాటలు రావే ఎలా.........
చింత నిప్పైన చల్లగా వుందని, ఎంత నొప్పైన తెలియలేదని, తననే తలచుకునే వేడిలో
ప్రేమ అంటేనే తియ్యని బాధని, లేత గుండెల్లో కొండంత బరువని, కొత్తగా తెలుసుకునే వేళలో
కనబడుతోందా నా ప్రియమైన నీకు, నా యద కోత అని అడగాలనీ
అనుకుంటూ, తన చుట్టూ, మరి తిరిగిందనీ, తెలపకపొతే ఎలా .........
మనసున ఉన్నది, చెప్పాలనున్నది, మాటలు రావే ఎలా....
నీలి కన్నులో ఆతని బొమ్మని, చూసి నాకింకా చోటెక్కడుందని, నిదరే, కసురుకునే రేయిలో
మేలుకున్నాయిలె వింత కైపని, వేల ఊహల్లో ఊరేగు చూపుని, కలలే, ముసురుకునే హాయిలో
వినబడుతోందా నా ప్రియమైన నీకు, ఆశల రాగం అని అడగాలనీ
పగలేదో రేయేదో గురుతేలేదని, తెలపకపొతే ఎలా ........
మనసున ఉన్నది, చెప్పాలనున్నది, మాటలు రావే ఎలా
మాటున ఉన్నది, ఓ మంచి సంగతి, బయటకు రాదే ఎలా
అతడిని చూస్తే రెప్పలు వాలిపోయే, బిడియం ఆపేదెలా
ఎదురుగ వస్తే చెప్పక ఆగిపోయే, తలపులు చూపెదెలా
ఒకసారి, దరి చేరి, యద గొడవేమిటో తెలపకపోతే ఎలా.....
చిత్రం: ప్రియమైన నీకు
సంగీతం: రాజ్ కుమార్
గానం: చిత్ర
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment