Wednesday, November 17, 2010

నీటి మల్లై నన్ను గిల్లి....

నీటి మల్లై నన్ను గిల్లి వెళ్ళిపోకే మల్లె వాన
జంటనల్లే బంధమల్లే ఉండిపోవే వెండి వాన
తేనెల చినుకులు చవి చూపించి
కన్నుల దాహం ఇంకా పెంచి
కమ్మని కలలేమో అనిపించి
కనుమరుగై కరిగావా సిరి వాన
నువ్వస్తానంటే నేనోద్దంటానా
నువ్వస్తానంటే నేనోద్దంటానా


నువ్వస్తానంటే నేనోద్దంటానా
నువ్వస్తానంటే నేనోద్దంటానా 


ఎవ్వరినెప్పుడు తన వలలో....

ఎవ్వరినెప్పుడు తన వలలో బందిస్తుందో ఈ ప్రేమ
ఏ మదినెప్పుడు మబ్బులలో ఎగరేస్తుందో ఈ ప్రేమ
అర్థం కాని పుస్తకమే ఐన గాని ఈ ప్రేమ
జీవిత పరమార్థం తానె అనిపిస్తుంది ఈ ప్రేమ

ప్రేమ ప్రేమ ఇంతేగా ప్రేమ
ప్రేమ ప్రేమ ఇంతేగా ప్రేమ

ఇంతకు ముందర ఎందరితో ఆటాడిందో ఈ ప్రేమ
ప్రతి ఇద్దరితో నీ గాదె మొదలంటుంది ఈ ప్రేమ
కలవని జంటల మంటలలో కనపడుతుంది ఈ ప్రేమ
కలిసిన వెంటనె ఏమవునో చెప్పదు పాపం ఈ ప్రేమ

ప్రేమ ప్రేమ ఇంతేగా ప్రేమ
ప్రేమ ప్రేమ ఇంతేగా ప్రేమ

జాబిల్లి కోసం ఆకాశమల్లె వేచాను నీ రాకకై

జాబిల్లి కోసం ఆకాశమల్లె వేచాను నీ రాకకై
నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై
జాబిల్లి కోసం ఆకాశమల్లె వేచాను నీ రాకకై
నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై

నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ
మనసొక్కటి కలిసున్నది  ఏనాడైనా

నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ
మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా 
ఈ పువ్వులనే నీ నవ్వులుగా 
ఈ చుక్కలనే నీ కన్నులుగా 
నును నిగ్గుల ఈ మొగ్గలు నీ బుగ్గలుగా 
ఊహల్లో తేలి వుయ్యూతలూగి 
మేఘాలతోటి రాగల లేఖ 
నీకంపినాను రావా దేవి 

జాబిల్లి కోసం ఆకాశమల్లె వేచాను నీ రాకకై
నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై

జాబిల్లి కోసం ఆకాశమల్లె వేచాను నీ రాకకై........

నీ పేరొక జపమైనది నీ ప్రేమొక తపమైనది 
నీ ధ్యానమే వరమైనది ఎన్నాళ్ళైన 
నీ పేరొక జపమైనది నీ ప్రేమొక తపమైనది 
నీ ధ్యానమే వరమైనది ఎన్నాళ్ళైన 
ఉండి లేక ఉన్నది నీవే 
ఉన్న కూడా లేనిది నేనే 
నా రేపటి అడియాశల రూపం నీవే 
దూరాన ఉన్నా నా తోడు నీవే 
నీ దగ్గరున్న నీ నీడ నాదే
నాదన్నదంతా నీవే నీవే

జాబిల్లి కోసం ఆకాశమల్లె వేచాను నీ రాకకై
నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై

జాబిల్లి కోసం ఆకాశమల్లె వేచాను నీ రాకకై
వేచాను నీ రాకకై......

Saturday, May 29, 2010

మనసున ఉన్నది చెప్పాలనున్నది(manasuna vunnadi......)

మనసున ఉన్నది, చెప్పాలనున్నది, మాటలు రావే ఎలా
మాటున ఉన్నది, ఓ మంచి సంగతి, బయటకు రాదే ఎలా
అతడిని చూస్తే రెప్పలు వాలిపోయే, బిడియం ఆపేదెలా
ఎదురుగ వస్తే చెప్పక ఆగిపోయే, తలపులు  చూపెదెలా
ఒకసారి, దరి చేరి, యద గొడవేమిటో తెలపకపోతే ఎలా
మనసున ఉన్నది, చెప్పాలనున్నది, మాటలు రావే ఎలా.........


చింత నిప్పైన చల్లగా వుందని, ఎంత నొప్పైన తెలియలేదని, తననే తలచుకునే వేడిలో
ప్రేమ అంటేనే తియ్యని బాధని, లేత గుండెల్లో కొండంత బరువని, కొత్తగా తెలుసుకునే వేళలో
కనబడుతోందా నా ప్రియమైన నీకు, నా యద కోత అని అడగాలనీ
అనుకుంటూ, తన చుట్టూ, మరి తిరిగిందనీ, తెలపకపొతే ఎలా .........
మనసున ఉన్నది, చెప్పాలనున్నది, మాటలు రావే ఎలా....


నీలి కన్నులో ఆతని బొమ్మని, చూసి నాకింకా చోటెక్కడుందని, నిదరే, కసురుకునే రేయిలో
మేలుకున్నాయిలె వింత  కైపని, వేల ఊహల్లో ఊరేగు చూపుని, కలలే, ముసురుకునే హాయిలో
వినబడుతోందా నా  ప్రియమైన నీకు, ఆశల రాగం అని అడగాలనీ
పగలేదో రేయేదో గురుతేలేదని, తెలపకపొతే ఎలా ........


మనసున ఉన్నది, చెప్పాలనున్నది, మాటలు రావే ఎలా
మాటున ఉన్నది, ఓ మంచి సంగతి, బయటకు రాదే ఎలా
అతడిని చూస్తే రెప్పలు వాలిపోయే, బిడియం ఆపేదెలా
ఎదురుగ వస్తే చెప్పక ఆగిపోయే, తలపులు చూపెదెలా
ఒకసారి, దరి చేరి, యద గొడవేమిటో తెలపకపోతే ఎలా.....

చిత్రం: ప్రియమైన నీకు
సంగీతం: రాజ్ కుమార్
గానం: చిత్ర 

Friday, May 21, 2010

అల్లంత దూరాల ఆ తారక.....

అల్లంత దూరాల ఆ తారక, కళ్ళెదుట నిలిచింద ఈ తీరుగ
అరుదైన చిన్నారిగా, కోవెల్లో దేవేరిగా, గుండెల్లో కొలువుండగా  
భూమి కనలేదు ఇన్నాళ్ళుగా, ఈమెలా ఉన్న ఏ పోలిక
అరుదైన చిన్నారిగా, కోవెల్లో దేవేరిగా, గుండెల్లో కొలువుండగా
అల్లంత దూరాల ఆ తారక, కళ్ళెదుట నిలిచింద ఈ తీరుగా


 కన్యాదానంగా, ఈ సంపద, చేపట్టే ఆ వరుడు శ్రీహరి కాడా
 పొందాలుకున్నా, పొందే వీలుంద, అందరికి అందనిది సుందరి నీడ
ఇందరి చేతులు పంచిన మమత, పచ్చగ పెంచిన పులాత
నిత్యం విరిసే నందనమవధ
అందానికే అందమనిపించగా, దిగివచ్చెనో  ఏమో దివి కానుగ్గా....
అరుదైన చిన్నారిగా, కోవెల్లో దేవేరిగా, గుండెల్లో కొలువుండగా


తన వయ్యారంతో ఈ చిన్నది, లాగిందో  ఎందరిని నిలబడనీక
ఎన్నో వంపుల్తో పొంగే ఈ నది, తనేమదిని ముంచిందో ఎవరికీ ఎరుక
తొలి పరిచయమొక తీయని కలగా,  నిలిపిన హృదయమే సాక్షిగా
ప్రతి జ్ఞ్యాపకం దీవించగా, చెలి జీవితం వెలిగించగా .............
అల్లంత దూరాల ఆ తారక కళ్ళెదుట నిలిచింద ఈ తీరుగ

Aparichitudu Theme Music

చిత్రం: ఆడవారి మాటలకు అర్థాలే వేరులే 
సంగీతం: యువన్ శంకర్ రాజా 
గానం: S. P. బాలసుబ్రమణ్యం