ఎవ్వరినెప్పుడు తన వలలో బందిస్తుందో ఈ ప్రేమ
ఏ మదినెప్పుడు మబ్బులలో ఎగరేస్తుందో ఈ ప్రేమ
అర్థం కాని పుస్తకమే ఐన గాని ఈ ప్రేమ
జీవిత పరమార్థం తానె అనిపిస్తుంది ఈ ప్రేమ
ప్రేమ ప్రేమ ఇంతేగా ప్రేమ
ప్రేమ ప్రేమ ఇంతేగా ప్రేమ
ఇంతకు ముందర ఎందరితో ఆటాడిందో ఈ ప్రేమ
ప్రతి ఇద్దరితో నీ గాదె మొదలంటుంది ఈ ప్రేమ
కలవని జంటల మంటలలో కనపడుతుంది ఈ ప్రేమ
కలిసిన వెంటనె ఏమవునో చెప్పదు పాపం ఈ ప్రేమ
జాబిల్లి కోసం ఆకాశమల్లె వేచాను నీ రాకకై
నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై
జాబిల్లి కోసం ఆకాశమల్లె వేచాను నీ రాకకై
నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై
మనసున ఉన్నది, చెప్పాలనున్నది, మాటలు రావే ఎలా మాటున ఉన్నది, ఓ మంచి సంగతి, బయటకు రాదే ఎలా అతడిని చూస్తే రెప్పలు వాలిపోయే, బిడియం ఆపేదెలా ఎదురుగ వస్తే చెప్పక ఆగిపోయే, తలపులు చూపెదెలా ఒకసారి, దరి చేరి, యద గొడవేమిటో తెలపకపోతే ఎలా మనసున ఉన్నది, చెప్పాలనున్నది, మాటలు రావే ఎలా.........
చింత నిప్పైన చల్లగా వుందని, ఎంత నొప్పైన తెలియలేదని, తననే తలచుకునే వేడిలో ప్రేమ అంటేనే తియ్యని బాధని, లేత గుండెల్లో కొండంత బరువని, కొత్తగా తెలుసుకునే వేళలో కనబడుతోందా నా ప్రియమైన నీకు, నా యద కోత అని అడగాలనీ అనుకుంటూ, తన చుట్టూ, మరి తిరిగిందనీ, తెలపకపొతే ఎలా ......... మనసున ఉన్నది, చెప్పాలనున్నది, మాటలు రావే ఎలా....
నీలి కన్నులో ఆతని బొమ్మని, చూసి నాకింకా చోటెక్కడుందని, నిదరే, కసురుకునే రేయిలో మేలుకున్నాయిలె వింత కైపని, వేల ఊహల్లో ఊరేగు చూపుని, కలలే, ముసురుకునే హాయిలో వినబడుతోందా నా ప్రియమైన నీకు, ఆశల రాగం అని అడగాలనీ పగలేదో రేయేదో గురుతేలేదని, తెలపకపొతే ఎలా ........
మనసున ఉన్నది, చెప్పాలనున్నది, మాటలు రావే ఎలా మాటున ఉన్నది, ఓ మంచి సంగతి, బయటకు రాదే ఎలా అతడిని చూస్తే రెప్పలు వాలిపోయే, బిడియం ఆపేదెలా ఎదురుగ వస్తే చెప్పక ఆగిపోయే, తలపులు చూపెదెలా ఒకసారి, దరి చేరి, యద గొడవేమిటో తెలపకపోతే ఎలా.....
చిత్రం: ప్రియమైన నీకు సంగీతం: రాజ్ కుమార్ గానం: చిత్ర
అల్లంత దూరాల ఆ తారక, కళ్ళెదుట నిలిచింద ఈ తీరుగ అరుదైన చిన్నారిగా, కోవెల్లో దేవేరిగా, గుండెల్లో కొలువుండగా భూమి కనలేదు ఇన్నాళ్ళుగా, ఈమెలా ఉన్న ఏ పోలిక అరుదైన చిన్నారిగా, కోవెల్లో దేవేరిగా, గుండెల్లో కొలువుండగా అల్లంత దూరాల ఆ తారక, కళ్ళెదుట నిలిచింద ఈ తీరుగా
కన్యాదానంగా, ఈ సంపద, చేపట్టే ఆ వరుడు శ్రీహరి కాడా పొందాలుకున్నా, పొందే వీలుంద, అందరికి అందనిది సుందరి నీడ ఇందరి చేతులు పంచిన మమత, పచ్చగ పెంచిన పులాత నిత్యం విరిసే నందనమవధ అందానికే అందమనిపించగా, దిగివచ్చెనో ఏమో దివి కానుగ్గా.... అరుదైన చిన్నారిగా, కోవెల్లో దేవేరిగా, గుండెల్లో కొలువుండగా
తన వయ్యారంతో ఈ చిన్నది, లాగిందో ఎందరిని నిలబడనీక ఎన్నో వంపుల్తో పొంగే ఈ నది, తనేమదిని ముంచిందో ఎవరికీ ఎరుక తొలి పరిచయమొక తీయని కలగా, నిలిపిన హృదయమే సాక్షిగా ప్రతి జ్ఞ్యాపకం దీవించగా, చెలి జీవితం వెలిగించగా ............. అల్లంత దూరాల ఆ తారక కళ్ళెదుట నిలిచింద ఈ తీరుగ